హింసాత్మక చర్యలతో ఏమి సాధించలేరు: సీఎం రేవంత్ రెడ్డి….

On: Saturday, March 7, 2026 8:58 PM

 

హైదరాబాద్:మార్చి 07:

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగి పోయారు లొంగిపోయిన వారిలో మావోయిస్టు నేతలు దేవ్‌జీ బడే చొక్కారావు, గన్‌మెన్‌లు ఉన్నారు.

శనివారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో డీజీపీ శివధర్‌ రెడ్డి, ఆధ్వర్యాన సీఎం రేవంత్ రెడ్డి, సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ గడ్డపై హింసకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి, అన్నారు.

హింసాత్మక చర్యల ద్వారా ఏమి సాధించలేరని అన్నారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపో యేలా పోలీసులు కృషి చేశారని మావోయిస్టుల్లో ఒక నమ్మకాన్ని కలిగిం చారని కొనియాడారు. లొంగిపోయిన మావోయి స్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం 130 మంది 124 తుపాకులతో లొంగి పోవడం విశేషం. వీటిలో 31 ఏకే 47 తుపాకులు న్నాయి. ఈ సందర్భంగా నక్సల్స్‌ అప్పగించిన తుపాకులను సీఎం పరిశీలించారు. లొంగిపోయిన వారిలో 125 మంది చత్తీస్‌గఢ్‌, 4గురు తెలంగాణకు చెందిన అజ్ఞాతంలో ఉన్నవారు , ఒకరు ఏపీకి చెందిన వారని డీజీపీ వెల్లడించారు.

08 Mar 2026

Leave a Comment