12వ వార్డులో అభివృద్ధి గళం- కాంగ్రెస్ అభ్యర్థి తాటి నీలిమ హన్మండ్లు…

On: Monday, February 9, 2026 9:00 PM

 

12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శ్రీమతి తాటి నీలిమ హన్మండ్లు ప్రజల మధ్య విశేష ఆదరణ పొందుతున్నారు.

నీతి, నిజాయితీతో ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆమె, ఎక్కడా డబ్బుల ఆశ లేకుండా ప్రజలకు సేవ చేసి ఆదర్శంగా నిలిచారు. కొత్త ఇండ్లకు పర్మిషన్ల విషయంలో రూపాయి కూడా ఆశించకుండా సహకరించడమే కాకుండా, వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తిచేయించి మౌలిక వసతులను మెరుగుపరిచారు.

అలాగే నీటి కొరత లేకుండా బోర్లు వేసి ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందిస్తూ, మీలో ఒకరిగా నిలబడి పనిచేసిన నాయకురాలిగా ఆమెకు ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది.

వార్డు అభివృద్ధి కొనసాగాలంటే, నిజాయితీ గల నాయకత్వం కావాలంటే శ్రీమతి తాటి నీలిమ హన్మండ్లు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానికులు కోరుతున్నారు.

👉 చేయి గుర్తుకే మన ఓటు

👉 కాంగ్రెస్ పార్టీకే మన మద్దతు

10 Feb 2026

Leave a Comment