
A9 న్యూస్ ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని పదో వార్డ్ టీచర్స్ కాలనీలో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నూగురు జ్యోతి లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు విజయ్ మాలంగి, జావిద్, షరీఫ్, వివేకానంద, ఖాన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ అవేజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయ్ మాలంగి మాట్లాడుతూ… పదో వార్డులో మురికి కాలువలు లేకపోవడం, తాగునీటి సమస్య, అంగన్వాడి కేంద్రాల అభివృద్ధి లోపించడం, ప్రమాదకర విద్యుత్ తీగల తొలగింపు వంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
“మనల్ని ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారు?” అని ప్రశ్నిస్తూ, ప్రజలకు నిజమైన మార్పు కావాలంటే చీపురు గుర్తుకు ఓటు వేసి నూగురు జ్యోతి లక్ష్మీనారాయణ ని గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొని అభ్యర్థికి తమ మద్దతును ప్రకటించారు. పదో వార్డును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుబడి ఉందని నాయకులు తెలిపారు.








