ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్నాసే తిరుమల–సుమన్ (భారత్ గ్యాస్) గారు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. “చేతు గుర్తుకే మన ఓటు” నినాదంతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలకు వార్డు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజలే కేంద్రబిందువు అని పేర్కొన్న ఆయన, చేతు గుర్తు అంటే నమ్మకం, భరోసా, ప్రజల పక్షాన నిలిచే శక్తి అని అన్నారు. హామీలకే పరిమితం కాకుండా అమలులో నిజాయితీతో పనిచేసే ప్రజాప్రతినిధిగా నిలుస్తానని స్పష్టం చేశారు.
గతంలోనూ ప్రజలతో సన్నిహితంగా ఉంటూ సేవాభావంతో పనిచేసిన వ్యక్తిగా బత్నాసే తిరుమల–సుమన్ కి వార్డు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆయన గెలుపే 29వ వార్డు అభివృద్ధికి కొత్త దిశగా నిలుస్తుంది అని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతి గుర్తుపై ఓటు వేసి బత్నాసే తిరుమల–సుమన్ ని 29వ వార్డు కౌన్సిలర్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.








