వార్డు అభివృద్ధి–బలమైన నాయకత్వమే లక్ష్యం…

On: Monday, February 9, 2026 10:41 AM

 

14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి షేక్ సైఫ్ (సోను) ప్రచారం…

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సైఫ్ (సోను) గారు వార్డు అభివృద్ధి మరియు బలమైన నాయకత్వం నినాదంతో ఎన్నికల బరిలో నిలిచారు. “ప్రగతికి ఓటు వేయండి… కాంగ్రెస్‌కు ఓటు వేయండి” అనే పిలుపుతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఈ సందర్భంగా షేక్ సైఫ్ మాట్లాడుతూ, వార్డు సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజలే కేంద్రబిందువని పేర్కొన్న ఆయన, చేతి గుర్తు అంటే నమ్మకం, భరోసా, ప్రజల పక్షాన నిలిచే శక్తి అని అన్నారు. హామీలకే పరిమితం కాకుండా అమలులో నిజాయితీతో పనిచేసే ప్రజాప్రతినిధిగా నిలుస్తానని తెలిపారు.

గతంలోనూ ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ సేవాభావంతో పనిచేసిన వ్యక్తిగా షేక్ సైఫ్ (సోను) గారికి వార్డు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆయన గెలుపే 14వ వార్డు అభివృద్ధికి కొత్త దిశగా మారుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాలెట్ సంఖ్య 05 – చేతి గుర్తుపై ఓటు వేసి షేక్ సైఫ్ (సోను) గారిని 14వ వార్డు కౌన్సిలర్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

14 Mar 2026

Leave a Comment