పాలకుడిని కాదు… మీ సేవకుడిని!
ఆశీర్వదించండి – అభివృద్ధి చేసి చూపిస్తా…
పని చేసేవాడు సేవకుడు,
పని చేయించేవాడు పాలకుడు,
పని చేస్తూ… చేయించేవాడు నిజమైన నాయకుడు.
ఆ సేవా భావంతోనే మీ ముందుకు వస్తున్నాను.
శ్రీమతి శేర్ల మమత గంగాధర్ గౌడ్ (గంగూలి)
ఆర్మూర్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని
👉 మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి
👉 6వ వార్డు కౌన్సిలర్‌గా గెలిపించండి
మన 6వ వార్డు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి,
రాబోయే రోజుల్లో ఆదర్శవంతమైన, సురక్షితమైన, సుందరమైన వార్డుగా తీర్చిదిద్దాలనే ఆశతో కాదు – ఆశయంతో మీ ముందుకు వస్తున్నాను.
మీ అందరి మధ్యే పెరిగిన వ్యక్తిగా,
మీ కష్టాలు నాకు తెలుసు…
మీ సమస్యలే నా బాధ్యత.
అధికారం కోసం కాదు… అభివృద్ధిలో భాగస్వామి కావడానికి
నాకు ఒక అవకాశం ఇవ్వండి.
నా హామీలు – నా మాట కాదు, నా బాధ్యత
• వార్డులో ఎక్కడ ఇబ్బంది ఉన్నా సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణం చేయిస్తాను.
• ప్రధాన రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయిస్తాను.
• వార్డులోని స్మశానవాటికలను అభివృద్ధి చేసి, వైకుంఠ ధామాల నిర్మాణం చేయిస్తాను.
• గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి ఇప్పటికే ఇచ్చింది. ఇంకా ఎవరు అర్హులు ఉంటే వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తాను.
• కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడి వార్డులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తొలగించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తాను.
• ఏ సమస్య వచ్చినా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, మీ కష్టాల్లో భాగస్వామిని అవుతాను.
మీ అమూల్యమైన ఓటుతో
అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా వినమ్ర ప్రార్థన
చేతి గుర్తుకు ఓటు వేయండి – అభివృద్ధిని గెలిపించండి ✋
మీ సేవకురాలు,
శేర్ల మమత గంగాధర్ గౌడ్ (గంగూలి)
6వ వార్డు – ఆర్మూర్ మున్సిపాలిటీ






