ఆలూరు మండలం దేగం గ్రామంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నేడు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞయాగాదులు పూర్తి చేసి, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత రథోత్సవ సేవను భక్తిశ్రద్ధలతో జరిపారు.
ఈ కార్యక్రమానికి ఆలూరు ఎమ్మార్వో రమేష్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మార్వోను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దేగం విడిసి సభ్యులు, ఉజ్వల వ్యవస్థాపక అధ్యక్షులు మినీ శ్రీకాంత్‌తో పాటు పలువురు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
దేగం లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలూరు ఎమ్మార్వో రమేష్‌ను సన్మానిస్తున్న గ్రామస్తులు.






