ఆర్మూర్ ప్రెస్ క్లబ్ భవనంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు….

On: Tuesday, January 27, 2026 6:15 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథ పురం ప్రెస్ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చౌల్ సందీప్ జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు.

అనంతరం పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సందీప్‌తో పాటు సీనియర్ జర్నలిస్టులు పుట్టి మురళి, రాజేశ్వర్ గౌడ్, పింజ సుదర్శన్ మాట్లాడారు. మొట్టమొదటిసారిగా ప్రెస్ క్లబ్ భవనంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ప్రెస్ క్లబ్ భవనంలో జర్నలిస్టులంతా కలిసి నిర్వహించుకుంటామని తెలిపారు.

ఇరు ప్రెస్ క్లబ్‌ల సభ్యులు ఐక్యతతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం హర్షణీయమని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్, నవనాథ పురం ప్రెస్ క్లబ్‌లకు చెందిన సభ్యులు మనోహర్, కలిగోట చిన్న, రాజేందర్, రాజేష్, చరణ్ గౌడ్, సంతోష్, రాజ్ న్యూస్ శ్రావణ్, సాయి ప్రణీత్, చక్రి, లిక్కీ శ్రావణ్, దినేష్, క్రాంతి, బొడ్డు శ్రవణ్, రాకేష్, గణేష్, సాజిద్, అరుణ్, శ్రీనివాస్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

05 Feb 2026

Leave a Comment