హైదరాబాద్:జనవరి 26:
మూడు ట్రీలియన్ డాలర్ల ఎకనామి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని, తెలంగాణ గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ, పేర్కొన్నారు. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న వేళ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా అయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ వేడుకల్లో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి,లు పాల్గొన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘రైజింగ్ తెలంగాణ–2047’ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రభు త్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం స్వల్ప కాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించిందని గవర్నర్ కొనియాడారు.
రాజ్యాంగ విలువలను కాపాడుతూ, అభివృద్ధి మార్గంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘రైజింగ్ తెలంగాణ’ డాక్యుమెంట్ హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత పెంచేలా రూపొందించబడిందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, ప్రతి ప్రాంతానికి తగిన అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చామని, ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. విద్య, ఉపా ధి రంగాల్లో చేపడుతున్న ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక బలాన్ని మరింత పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ తెలిపారు.
ధాన్యం ఉత్పత్తిలో సాధించిన విజయంతో పాటు, రైతులకు ప్రభుత్వం భారీగా మద్దతు అందిస్తోం దన్నారు. ధాన్యానికి బోనస్‌గా రూ.1,780 కోట్లను చెల్లించడంతో పాటు, సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు 26 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
భూ వివాదాల పరిష్కారా నికి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. మేడారం అభివృద్ధికి రూ.251 కోట్లు కేటాయించడం ద్వారా గిరిజన సంస్కృతి పరిరక్షణకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం పేదలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి లక్షల సంఖ్యలో ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 1.30 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. వైద్య రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 27 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నా రు.








