ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం, సీనియర్ సిటిజన్స్ ఫోరం ల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసి,జాతీయ గీతాన్ని ఆలపించారు.అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 77 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెన్షనర్స్ అందరి భావి జీవితం అనునిత్యం ఆనందమయంగా గడపాలని కోరారు.ఈ సందర్భంగా గేమ్స్ సెక్రటరీ కరాటే భోజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటలు పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు.తర్వాత హాజరైన పెన్షనర్స్ కు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన సౌండ్ సిస్టం స్పాన్సర్ చేస్తానని ప్రకటించిన అంజయ్యకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్ ఫైనాన్స్ సెక్రటరీ నవజీవన్,విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి కరుణాసాగర్ రెడ్డి, స్టేట్ కౌన్సిలర్ పుష్పకర్ రావు, సీనియర్ సిటిజన్స్ ఫోరం కన్వీనర్ రామ్మూర్తి,కో- కన్వీనర్ సాయన్న పెన్షనర్స్ తదితరులు పాల్గొన్నారు.








