A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి:
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్‌ను శనివారం ప్రోగ్రామ్ మేనేజర్ (PM) జనార్ధన్, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (EME) స్వరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లోని మందుల నిల్వలు, అత్యవసర వైద్య పరికరాల పనితీరు, లాగ్ బుక్స్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనం కండిషన్, ఆక్సిజన్ సిలిండర్ల స్థితి సక్రమంగా ఉన్నాయని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో 108 సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం లేకుండా బాధితులకు తక్షణ స్పందన ఇచ్చి ప్రాణాలను కాపాడేలా పనిచేయాలని హితవు పలికారు. ఈ తనిఖీ కార్యక్రమంలో 108 సిబ్బంది ఈఎంటీ అకేష్, పైలట్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.





