A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆలూర్ మండలంలోని మిర్దపల్లి గ్రామంలో తన నివాస ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితురాలు సౌడ ప్రమీల ఆరోపించారు. తన కొడుకు సౌడ గిరి, పంచాయతీ కార్యదర్శి, కారోబార్‌ల సహకారంతో తన ఇంటిని తనకు తెలియకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె వాపోయారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు, అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు సౌడ ప్రమీల తెలిపారు. న్యాయం కోసం అన్ని ఆధారాలతో అధికారులను ఆశ్రయించామని, కానీ ఇప్పటివరకు సరైన చర్యలు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించి, విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితురాలు సౌడ ప్రమీల కోరుతున్నారు. గ్రామంలో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు.






