హైదరాబాద్:జనవరి23:
మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టింది అధికార హస్తం పార్టీ. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. పార్లమెంట్ నియోజకవ ర్గాల వారీగా ఎన్నికల బాధ్యులను ప్రకటించింది పార్టీ. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు 15 మంది మంత్రులను ఇంచా ర్జ్‌లను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గాల వారీగా మంత్రులు సన్నాహక సమావేశాలు పెట్టాలని సూచించారు.
అయితే ఇంచార్జ్ మంత్రుల కు అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అధికార పార్టీ తరఫున పోటీ కోసం తీవ్రస్థాయిలో పోటీ ఉందని మంత్రుల దృష్టికి వచ్చింది. కొత్త, పాత కాంగ్రెస్ నేతలు టిక్కెట్ల కోసం వర్గాలుగా విడిపోయి పోటీ పడుతు న్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్‌లో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం రసాభాసాగా మారింది.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి,మధ్య ఇప్పటికే ఉప్పు-నిప్పులా ఉన్న వ్యవహారం కాస్త..సన్నాహక సమావేశం సాక్షిగా మరోసారి దుమారం రేగింది.ఏకంగా సంజయ్ ఉన్న మీటింగ్‌కు తాను హాజరుకాబోనని సమావే శం నుంచి బయటికి వచ్చి రచ్చ చేశారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి.
ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక మంత్రులకు పెద్ద సవాల్‌గా మారింది. పోటీ చేయనున్న ప్రతి స్థానానికి ఆరుగురు పేర్లతో లిస్ట్ రెడీ చేయాలని మంత్రులను పీసీసీ చీఫ్, సీఎం ఆదేశించారు. అయితే ఒక్కో స్థానం నుంచి ఇరవై మందికిపైగా ఆశావహులు ఉండటంతో తలలు పట్టుకుంటున్నారు నే తలు.మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం, డీసీసీ అధ్యక్షుడి వర్గం, పీసీసీ వర్గం, ఇంచార్జ్ మంత్రి వర్గం, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మంత్రి వర్గం అంటూ డజన్ల మంది ఆశావహులు టికెట్ రేసులో ఉన్నారు.
ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే లు ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా ఉంది. జగిత్యాల, పటాన్ చెరు, గద్వాల్, బాన్సువాడ వంటి చోట్ల ఎవరికి టికెట్ రాకపో యినా మిగతా వర్గాల వాళ్లతో కలిసి..పార్టీ టికెట్ ఇచ్చిన వారికి వ్యతిరేకంగా పనిచేసేలా క్లాషెస్ ఉన్నా యట. దీంతో మంత్రులకు కొత్త భయం పట్టుకుందట.
*మంత్రులకు సవాల్ గా మారిన మున్సిపల్ ఎన్నికలు…
పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతల తప్పిదాలపై సీఎం రేవంత్ బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారట. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు..లోకల్ పోరులో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇద్దరు మంత్రులు మారెప్ప, మాగంటి బాబులు రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్న మంత్రులకు ఈ ఎన్నికలు డూ ఆర్ డై అన్నట్లుగా మారాయట.








