Jan ,21, 2026:
తెలంగాణ : ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనను సీఎం ముందుంచగా, గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు మద్దతు ప్రకటించారు. పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార నిర్ణయాలకు ఏడాది కాలం చాలా ఎక్కువగా మారిందని, అందుకే జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించడం ద్వారా నిర్ణయాలను వేగవంతం చేయవచ్చని సీఎం సూచించారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందని తెలిపారు.








