A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి:
జాక్రాన్ పల్లి గ్రామానికి చెందిన మనసా తాళి అనే గర్భిణీ మహిళకు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లోనే విజయవంతంగా ప్రసవం జరిగింది. సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది పైలట్ నరేష్ మరియు ఈఎంటి ఆకేష్ సమర్థవంతమైన సేవలతో తల్లి, బిడ్డను సురక్షితంగా కాపాడారు.
ప్రయాణ సమయంలోనే ప్రసవ నొప్పులు ఎక్కువ కావడంతో పరిస్థితిని గమనించిన సిబ్బంది తక్షణమే అంబులెన్స్‌లోనే అవసరమైన వైద్య చర్యలు చేపట్టారు. వారి నైపుణ్యం, అంకితభావంతో ఆరోగ్యవంతమైన మగబిడ్డ జన్మించింది. ప్రస్తుతం తల్లి మరియు శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
108 అంబులెన్స్ సిబ్బంది చూపిన సేవాభావం, ధైర్యసాహసాలకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సంఘటన అత్యవసర సేవల ప్రాముఖ్యతను మరోసారి చాటింది.








