పెర్కిట్ గ్రామంలో మూడుముక్కల పేకాట – నలుగురు వ్యక్తుల అరెస్ట్…

On: Saturday, January 10, 2026 7:10 PM

 

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:

పెర్కిట్ గ్రామంలో అక్రమ పేకాటపై పోలీసులు దాడి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు.ఈ సంఘటన శనివారం ఉదయం 4:00 గంటల సమయంలో చోటుచేసుకుంది.

పెర్కిట్ గ్రామ పరిధిలోని కల్లుబట్టి బయట ప్రాంతంలో మూడుముక్కల పేకాట ఆడుతున్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో పెర్కిట్ గ్రామానికి చెందిన మేతరి నవీన్, నాగరాజు, హన్వాతే రాములు, అలాగే కేశపురం నవీన్ అనే నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు.

వారి వద్ద నుంచి రూ.8,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

05 Feb 2026

Leave a Comment