జక్రాన్‌పల్లి:
మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించకపోవడం, తక్కువ తూకం వేయడం, ఆలస్యంగా చెల్లింపులు చేయడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు
.







