మహిళ విద్య విప్లవ ప్రతీక సావిత్రి బాయి పూలే-ఇరవత్రి రాజశేఖర్….

On: Saturday, January 3, 2026 7:34 PM

నేడు ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా లో దళిత, బహుజన, ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు అంగరి ప్రదీప్ ఆధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు,ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరవత్రి రాజశేఖర్ గారు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే జీవితాన్ని,త్యాగాన్ని విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోని చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అని పిలుపునిచ్చారు.సావిత్రిబాయి పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాటం చేసిన సామాజిక సంఘ సంస్కర్త,సామాజిక మహిళ వైతాళికురాలని,స్త్రీ విద్య కోసం పాటుబడినజ్ఞాన వనిత,భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రి భాయి పూలే స్పూర్తితో నేటి విద్యార్థులంతా తమ లక్ష్యాలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు

సీనియర్ దళిత బహుజన నాయకులు కొక్కెభూమన్న,ఆర్గుల్ సురేశ్,షెట్పల్లి నారాయణ,గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్,గంగాధర్ గౌడ్ లు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే జయంతి రోజును ప్రభుత్వం అధికారికంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాడాన్ని గొప్ప శుభపరిణామం గా పేర్కొన్నారు

MRPS జిల్లా మాజీ అధ్యక్షుడు మైలరాం బాలు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలల్లో సంపూర్ణంగా ఉండేటట్లు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.సావిత్రి బాయి పూలే ఆశయాలను కొనసాగించడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని వివిధ దళిత బహుజన సంఘాల నాయకులు పింజ సుదర్శన్,పులి గంగాధర్, పింజ పెద్ద భోజన్న, లింగన్న,పేర్కొన్నారు.మనకు అక్షరాలను నేర్పింది సావిత్రిబాయి పూలే కనుక సావిత్రిబాయి పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతిఒక్కరూజరుపుకోవాలని,సావిత్రి బాయి పూలే ఆశయాలను,ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం అనిదళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు చిటుమాలనగేష్,హేమంత్,ఇందరపు రాజు పిలుపునిచ్చారూ.

ఈకార్యక్రమంలో కొంతం మురళీధర్, పూర్ణ,రచర్ల సాయిరాం,రొడ్డ సాయన్న,ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు.

13 Mar 2026

Leave a Comment