బడా భీంగల్ గ్రామంలో విద్యుత్ బిల్లుల అంశంపై ప్రజల విజ్ఞప్తి…

On: Friday, January 2, 2026 10:40 AM

 

A9 న్యూస్ ప్రతినిధి:

బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం, బడా భీంగల్ గ్రామంలో విద్యుత్ బిల్లుల వసూలు విషయంలో ఇటీవల కొన్ని ఆరోపణలు వెలువడ్డాయి. లైన్మెన్ వీర్ కుమార్ పలువురి నుంచి బిల్లుల రూపంలో డబ్బులు వసూలు చేసి సంబంధిత ఖాతాల్లో జమ చేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇటీవల A9 న్యూస్‌లో ప్రసారం అయిన కథనం ప్రజల్లో చర్చకు దారితీసింది.

వార్త ప్రసారం అనంతరం “ఈరోజే బిల్లులు చెల్లిస్తాం, వార్తను తొలగించండి” అంటూ బాధితులకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. అయితే 4రోజులు గడిచినా ఇప్పటివరకు స్పష్టమైన పరిష్కారం కాలేదు, అధికారిక స్పందన కానీ లేకపోవడంతో బాధితులు నిరాశకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పూర్తి విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు స్పందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

15 Mar 2026

Leave a Comment