2026కు ఘన స్వాగతం…!
ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలోని ఆర్మూర్ గర్ల్స్ వన్ మైనారిటీ పాఠశాల ఆవరణలో నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ, 2026వ సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో “2026” ఆకారంలో కూర్చొని చూపరులను ఆకట్టుకునేలా ప్రదర్శన చేశారు. ఈ దృశ్యం అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
విద్యార్థుల సృజనాత్మకత, క్రమశిక్షణతో కూడిన ఈ ప్రదర్శన పాఠశాల వాతావరణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నహీదా ఫిర్దోస్ విద్యార్థుల ప్రతిభపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఐక్యత, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయని తెలిపారు. నూతన సంవత్సరాన్ని ఈ విధంగా అర్థవంతంగా ఆహ్వానించినందుకు పాఠశాలలోని టీచింగ్ స్టాఫ్, నాన్-టీచింగ్ స్టాఫ్ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, నూతన సంవత్సరాన్ని ఆశావహంగా ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచింది.






