దాబా హోటళ్ళలో పోలీసుల తనిఖీలు…

On: Tuesday, December 30, 2025 7:34 AM

 

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :

జక్రాన్ పల్లి మండలంలోని వివిధ దాబా హోటల్లపై సోమవారం జక్రాన్ పల్లి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు, దాబా హోటల్ యజమానులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసారు, దాబలా వద్ద ప్రవేశ ద్వారాలు, పార్కింగ్ ప్రదేశాల వద్ద మరియు లోపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి నిరంతరం పని చేసేలా చూడాలని సూచించారు, దాబాలకు వచ్చే ప్రతీ వాహనం మరియు వ్యక్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ముక్యంగా రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని అదేశించారు,దాబాల వద్ద ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా నేరస్థులకు ఆశ్రయం ఇవ్వకుండా చట్ట నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టంగా తెలిపారు,పోలీసుల సూచనలు ఉల్లంఘించినచో చట్టపరమైన కఠిన చర్యలు తీస్కుంటామని దాభ యజమానులకు ఎస్సై మహేష్ మరియు సిబ్బంది హెచ్చరించారు.

14 Mar 2026

Leave a Comment