ఆర్మూర్‌లో 108 అంబులెన్స్‌పై ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అధికారులు….

On: Monday, December 29, 2025 8:32 PM

 

వివరాలు:

ఆర్మూర్ పట్టణంలోని 108 అంబులెన్స్ వాహనాన్ని ఉమ్మడి జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ గారు మరియు జిల్లా కోఆర్డినేటర్ స్వరాజ్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, ప్రాణాపాయకర పరిస్థితుల్లో ఉపయోగించే మందులు, ఆక్సిజన్ సదుపాయాలు మరియు ఇతర అవసరమైన సామగ్రిని జాగ్రత్తగా పరిశీలించారు. అలాగే అంబులెన్స్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను కూడా తనిఖీ చేశారు.

ప్రజలకు అత్యవసర సమయంలో వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 108 సేవలు ప్రజలకు ఎంతో కీలకమైనవని, అందువల్ల విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ తిరుమలేష్ మరియు పైలెట్ గణేష్ పాల్గొన్నారు.

11 Mar 2026

Leave a Comment