A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ టీచర్స్ కాలనీ లో గల క్షత్రియ పాఠశాలలో సోమవారం గీతా జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ నవిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారులు శ్లోక పఠనం చేసి, వాటికి అర్ధ వివరణ ఇవ్వడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్న విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “మా పాఠశాలలో ఉన్నత విద్యతో పాటు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం లక్ష్యంగా భగవద్గీతను పాఠ్యాంశంగా బోధిస్తున్నాము’’ అని పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ నవిత మాట్లాడుతూ….
“భగవద్గీత సందేశం ఒక అర్జునుడికే కాదు, సమస్త మానవాళికే వర్తిస్తుంది. మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అందించిన ఈ ధర్మ సందేశం విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు దైవభక్తి, మంచి సంస్కారాలను పెంపొందిస్తుంది’’ అని తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.








