ఆర్మూర్ జిరాయత్‌నగర్ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.5 లక్షలతో పనుల ప్రారంభం…..

On: Thursday, July 2, 2026 9:51 AM
  • ఆర్మూర్ జిరాయత్‌నగర్ శ్మశానవాటిక అభివృద్ధికి రూ.5 లక్షలతో పనుల ప్రారంభం…..
  • కే.ఆర్. సురేష్ రెడ్డి సేవలు చిరస్మరణీయం: బీఆర్ఎస్ నాయకులు షాహిద్ అలీ…..

    ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్‌నగర్ పహాడీగూడా శ్మశానవాటిక అభివృద్ధి కోసం మాజీ రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేష్ రెడ్డి తన రాజ్యసభ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల (MPLADS) నుంచి మంజూరు చేసిన రూ.5 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు షాహిద్ అలీ మాట్లాడుతూ, మాజీ రాజ్యసభ సభ్యుడిగా కే.ఆర్. సురేష్ రెడ్డి తన నిధుల్లో అధిక భాగాన్ని నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయించి జిల్లాపై ఉన్న తన నిబద్ధతను చాటుకున్నారని పేర్కొన్నారు.

    రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని రాజ్యసభలో బలంగా ప్రస్తావించడంతో పాటు, మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, వక్ఫ్ బోర్డు బిల్లు వంటి కీలక అంశాలపై ధైర్యంగా గళం వినిపించిన నాయకుడిగా కే.ఆర్. సురేష్ రెడ్డి నిలిచారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్, హైదరాబాద్ ఐటీఐఆర్ (ITIR), వరంగల్ టెక్స్టైల్ పార్క్, జక్రాన్‌పల్లి విమానాశ్రయం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక కీలక అంశాలపై రాజ్యసభలో నిరంతరం పోరాడి రాష్ట్ర హక్కులను సమర్థంగా వినిపించారని కొనియాడారు. రాజ్యసభలో ఆయన చేసిన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, అప్పటి ఉపరాష్ట్రపతి సైతం తన ప్రసంగంలో కే.ఆర్. సురేష్ రెడ్డి పనితీరును ప్రశంసిస్తూ, ఇలాంటి సభ్యులు రాజ్యసభలో ఉంటే దేశానికీ, రాష్ట్రానికీ ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్న విషయాన్ని షాహిద్ అలీ గుర్తు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కే.ఆర్. సురేష్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజానాయకుడిగా ఆయన సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేవ్‌యార్డ్ అధ్యక్షులు మీర్ మజీద్, జిరాయత్‌నగర్ మర్కజ్ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్, ఉస్మాన్, సాజిద్, సాదిక్, రిజ్వాన్, జుబేర్, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

19 Jul 2026

Leave a Comment