దేగాం ప్రజల కల సాకారం.. కల్వర్ట్ నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు మంజూరు….

On: Tuesday, June 30, 2026 8:32 PM

 

వర్షాకాల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు – గ్రామస్థుల్లో హర్షం…

ఆలూరు మండలం, దేగాం గ్రామం :

దేగాం గ్రామ బస్టాండ్ కూడలి వద్ద కల్వర్ట్ లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో వర్షపు నీరు రోడ్డుపై చెరువులా నిలిచి సమీపంలోని ఇళ్లు, రైస్ మిల్లులోకి ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్థులు ఎదురుచూస్తున్న ఈ సమస్యకు ఎట్టకేలకు పరిష్కార మార్గం ఏర్పడింది.

గ్రామ పంచాయతీ తీర్మానం చేసి, ఎంపీడీఓ ద్వారా ఆర్ అండ్ బీ (R&B) అధికారులకు ప్రతిపాదనలు పంపగా, మహేష్ కుమార్ గౌడ్ మరియు వినయ్ కుమార్ రెడ్డి సహకారంతో కల్వర్ట్ నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు మంజూరయ్యాయి.

ఈ కల్వర్ట్ నిర్మాణం పూర్తయితే వర్షపు నీరు సక్రమంగా వెళ్లిపోవడంతో రహదారిపై నీరు నిలిచిపోవడం, ఇళ్లలోకి, రైస్ మిల్లులోకి నీరు చేరడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాకపోకలు కూడా మరింత సులభతరం కానున్నాయి.

ఈ సందర్భంగా కల్వర్ట్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేసిన మహేష్ కుమార్ గౌడ్, వినయ్ కుమార్ రెడ్డిలకు దేగాం గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పనులు త్వరితగతిన ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

26 Jul 2026

Leave a Comment