
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి:
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామ ఉపసర్పంచ్ నరేష్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, అనంతరం ఆయన్ని శాలువాతో సన్మానించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది,
*ఎమ్మెల్యే మాట్లాడుతు….
తెలంగాణ ఉద్యమ సమయం నుండి పుప్పాలపల్లి గ్రామం మీద అభిమానం అని అందుకే మీ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా 40కి పైనే మంజూరు అయ్యేలా చూసానని అభివృద్ధి విషయంలో ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆయన కోరారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,వార్డ్ సభ్యులు, మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.








