నాలుగో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు…..

On: Monday, January 5, 2026 12:05 PM

 

హైదరాబాద్:జనవరి 05

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజు కొనసాగుతున్నాయి శీతాకాల సమావేశాల్లో నేడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై సభలో చర్చిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 50- 60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓ ఆర్ ఆర్ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది…

సభలో ముఖ్యమైన చర్చలు, బిల్లుల ఆమోదం, నూతన నిర్ణయాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, హిల్ట్ పాలసీ తదితర అంశా లపై మాట్లాడనున్నారు. ఈ బిల్లులను శాసనసభలో ఆమోదించి అమలు చేసే అవకాశం ఉంది.

*తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్..

తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కి సంబంధించి పెండింగ్, వార్షిక నివేది కలను ఈ రోజు శాసనసభ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది. ఈ నివేదికలో భాగంగా భద్రతా, వాణిజ్య, నిర్వహణ సంబంధిత అం శాలపై చర్చించనున్నారు.

*తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు..

తెలంగాణ విశ్వవిద్యాల యాల సవరణ బిల్లుపై చర్చించనున్నారు. రాష్ట్రం లోని విద్యావ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. తెలం గాణలోని విశ్వవిద్యాల యాలకు సంబంధించి ఆర్థిక సహాయం, వనరులపై చర్చించనున్నారు.

*హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీపై లఘు చర్చ…

అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీ గురించి లఘు చర్చ జరుగనుంది. ఈ పాలసీలో భాగంగా హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములపై చర్చించనున్నారు.

*అసెంబ్లీ సమావేశాలకు దూరంగా బీఆర్ఎస్..

మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలకు ఈరోజు దూరంగా ఉండాలని భావించారు. ఉభయ సభలకు హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్నారు. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వటంలేదని నిరసనగా బీఆర్ఎస్ బాయ్‌కాట్ చేసింది.

ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు. పాలమూరు, రంగారెడ్డి, నదీ జలాలపై పోరాటానికి రెడీ అవు తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.

13 Jan 2026

Leave a Comment