హైదరాబాద్:డిసెంబర్ 17
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష షెడ్యూల్‌ను పాఠశాల విద్యా విభాగం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఇప్పటికే పేపర్ వన్, పేపర్ 2 కు మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తున్నా రు. ఈ టెట్ పరీక్షలు, జనవరి 3, 2026 నుండి జనవరి 20, 2026 వరకు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు కేవలం 9 రోజుల్లో, మొత్తం 15 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సి బి టి విధానంలో నిర్వహించనున్నారు.
ప్రతిరోజు పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరగనుంది.ప్రతి సెషన్ పరీక్షకు అభ్యర్థులకు 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయించారు.
జిల్లా వారీగా పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఏ రోజు ఏ జిల్లా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయి అనే పూర్తి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరి చింది. అభ్యర్థులు తమ పరీక్షా తేదీ, సమయం, కేంద్రాన్ని తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. అభ్యర్థులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, పరీక్షలకు సన్నద్ధం కావాలని, పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అధికారులు కోరారు.
*టెట్ ఎగ్జామ్ 2026 షెడ్యూల్…
జనవరి 3న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష.
జనవరి 4న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష.
జనవరి 5న రెండు సెషన్స్ లో సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష.
జనవరి 6న రెండు సెషన్స్ లో సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష.
జనవరి 8న రెండు సెషన్స్ లో పేపర్-1 పరీక్ష.
జనవరి 9న పేపర్-1 పరీక్ష ఒక్క సెషన్ మాత్రమే.
జనవరి 11న రెండు సెషన్స్ లో పేపర్-1 పరీక్ష.
జనవరి 19న పేపర్-1 (మైనర్) పరీక్ష (ఒక్క సెషన్ మాత్రమే).
జనవరి 20 పేపర్-2 పరీక్ష మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్స సోషల్ స్టడీస్ ఒక్క సెషన్ మాత్రమే.








