విశ్వకర్మ సమస్యలపై సుదర్శన్ రెడ్డిని కలిసిన శ్రీరామ్ మహిపాల్…..

On: Thursday, November 13, 2025 8:39 PM

 

నిజామాబాద్.నవంబర్ 13,

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమితులైన సుదర్శన్ రెడ్డిని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ సుదర్శన్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ మహిపాల్ శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం విశ్వకర్మ సమాజ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరియు సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

విశ్వకర్మ సమాజ సమస్యలను శ్రద్ధగా విన్న రాష్ట్ర సలహాదారు సుదర్శన్ రెడ్డి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

16 Dec 2025

Leave a Comment