
క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో గావ్‌ను ఝుమ్మాన్ – వేలాది భక్తుల పాల్గొనడం జరిగింధి.
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ దత్తాత్రేయ జయంతి ఈ సంవత్సరం కూడా గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని శివాజీ చౌరస్తా సమీపంలోని శాంతి ఆశ్రమంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, హోమం నిర్వహించారు.
సాయంత్రం వేళ స్వామివారి బారసాల కార్యక్రమం నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమాజ దాతల సహకారంతో భక్తులకు గావ్‌ను ఝుమ్మాన్ (ఊరి భోజనం) మరియు తీర్థప్రసాదాలు పెద్ద ఎత్తున అందించారు.
వేలాదిమంది క్షత్రియులు మహోత్సవంలో పాల్గొని దత్తాత్రేయుని ఆశీర్వాదాలు పొందారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని సమాజ అధ్యక్షులు బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్, కార్యదర్శి బారడ్ గంగామోహన్, కన్వీనర్ షికారి శ్రీనివాస్, కో-కన్వీనర్ డీకే శ్రీనివాస్ తెలిపారు. ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించినందుకు క్షత్రియ సమాజ్‌కు పట్కరి కులస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ నుండి బరహత్ హాజరైనవారిలో…
బచ్చేవాల్ రెడ్డి ప్రకాష్, బారడ్ గంగమోహన్, షికారి శ్రీనివాస్, డి.కే. శ్రీనివాస్, ఖాందేష్ శ్రీనివాస్, పడాల్ గణేష్, సాత్పుతే సంతోష్, నీరజ్, సాత్ పుతే శ్రీనివాస్, భారడ్ బాలాజీ, పాన్ శ్రీనివాస్, జెస్సు ఆనంద్, జెస్సు శ్రీనివాస్, సంతాని విజయ్, సంతాని అశోక్, చౌల్ రాజ్ కుమార్, కర్తన్ గంగామోహన్, రాజేందర్, పొహార్ శైలేష్ తదితరులు పాల్గొన్నారు.








