ఆర్మూర్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు….

On: Monday, May 25, 2026 4:01 PM

ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ వెళ్లే చౌరస్తాలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

స్థానికుల వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డ్ నుంచి కొత్త బస్టాండ్ వైపు వస్తున్న కారు డ్రైవర్‌కు అకస్మాత్తుగా తల తిరగడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులోని అన్ని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.

అయితే ఘటన సమయంలో అక్కడ కూర్చున్న ఓ వ్యక్తిని కారు ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

25 May 2026

Leave a Comment