భారత ఉపరాష్ట్రపతి గా రాధాకృష్ణన్….

On: Tuesday, September 9, 2025 8:36 PM

 

హైదరాబాద్:సెప్టెంబర్ 09

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గెలుపొందారు మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంటు సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రాష్ట్ర సమితి బి జె డి శిరోమణి ఆకాశీదళ్ సభ్యులు ఓటు వేయలేదు ఉపరాష్ట్రపతి అభ్యర్థులు గా ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, పోటీ చేశారు.

ఉపరాష్ట్రపతి కోట విజ యానికి కావలసిన ఓట్లు 377 కాగా రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రావడంతో గెలుపు సొంతమైంది. ఇక భారతదేశానికి కొత్త ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ కాబోతున్నారు. విపక్షాల కూటమి నుంచి ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా పోటీ చేసిన బి.సుదర్శన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ మంగళవారం భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఈ సాయంత్రం 5 గంటలకు ముగియగా, ఓట్ల లెక్కింపు అనంతరం రాత్రి 7:30 గంటలకు ఫలితాలు వెలువరించారు.

14 Feb 2026

Leave a Comment