నూత్ పల్లిలో ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు…..

On: Wednesday, September 17, 2025 10:38 AM

 

డొంకేశ్వర్,సెప్టెంబర్ 17,నూత్ పల్లి గ్రామం:

దేశ ప్రధానమంత్రి, విశ్వవిఖ్యాత జననేత నరేంద్ర మోడీ గారి 75వ పుట్టిన రోజు సందర్భంగా నూత్ పల్లి గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిజెపి నూత్ పల్లి శాఖ ఆధ్వర్యంలో గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేయడం జరిగింది. అదనంగా, గ్రామస్థులకు పండ్ల పంపిణీ కూడా చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని మోడీ గారి ఆరోగ్య సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.

14 Feb 2026

Leave a Comment