సమయానికి బస్సులు లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు….

On: Tuesday, December 30, 2025 10:49 AM

 

భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 30

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో మహిళా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది. కనీసం నిల్చోడానికీ బస్సుల్లో స్థలం ఉండటం లేదు. ప్రయాణి కుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచడంలో గోదావరిఖని,మంథని,డిపో అధికారులు విఫలమయ్యారు.

భూపాలపల్లి నుండి గోదావరిఖనికి 5 డిపోలకు చెందిన బస్సులు తిరుగు తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు సామాన్య ప్రయాణికులు తమ తమ అవసరాల నిమిత్తం భూపాలపల్లి,హనుమకొండ,వరంగల్,కాళేశ్వరం,ఈ రూటులో నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు.

ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగాల్సింది పోయి అంతకుముందు కంటే బస్సులు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. భూపాలపల్లి, రూట్లో ప్రైవేట్ అద్దె బస్సులు బస్సులు ఎక్కువగా తిరుగుతాయి, అగ్రిమెంట్ ఐపోయిన అద్దె బస్సుల స్థానంలో సంస్థ బస్సు నడపాల్సింది పోయి మాకేం సంభంధం లేదన్నట్టు వ్యవహరించడం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానికితోడు పొద్దంతా ఒకదాని వెంట మరోటి నడుస్తున్న బస్సులు చీకటి పడగానే ఒక్కటీ కనబడ టం లేదు.

ముఖ్యంగా భూపాలపల్లి బస్టాండ్ నుండి గోదావరిఖని కి సాయంత్రం 5:40 నిమిషాలకు బస్సు వెళ్లిపోయిందంటే మళ్ళీ రాత్రి 7వరకు గంటా ఇరవై నిమిషాలు బస్సు లేదు. ఇక అదే చివరి బస్సు. రెండు మూడు నెలల క్రితం వరకు రాత్రి 7:30కి మణుగూరు డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్ ఉండగా డిపో అధికా రులు దానిని క్యాన్సిల్ చేసి ఇప్పుడు దాని స్థానంలో సూపర్ లగ్జరి బస్సు నడుపుతున్నారు.

సూపర్ లగ్జరీ బస్సులో మహాలక్ష్మి పథకం వర్తించని కారణంగా రాత్రి 7గంటల బస్సే అందరికీ చివరి బస్సు అయ్యింది. ప్రతీరోజూ చచ్చి చెడి అదే బస్సులో 100 నుండి 120 మంది వరకు ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఒక్కోసారి బస్సు లోపలికి ఎక్కలేక కొంతమంది ఆగిపోవాల్సి వస్తుంది. ఏ ప్రయివేటు వెహికిల్ లోనో ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంతే గాక ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాళేశ్వరం వెళ్లి తిరుగుముఖంలో కరీంనగర్ వైపు రావాల్సిన ప్రయాణీకులు సైతం కాటారం లో దిగి గోదావరిఖని, మంథని బస్సుల కోసం ఎదురు చూడవలసి వస్తుంది

గోదావరిఖని, మంథని, భూపాలపల్లి,మూడు బస్ డిపోలు ఉన్నప్పటికీ ఏ ఒక్క డిపో వారు కూడా సమయానికి బస్సులు నడపలేకపోతున్నారు.సాయంత్రం నాలుగు గంటలకు భూపాలపల్లి నుండి మంథని, గోదావరిఖని, డిపోలకు వెళ్ళవలసిన బస్సులు మూడు, నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఒక బస్సు వెన కాలే మరొక బస్సు ఖాళీగా వెళ్తున్నాయి, అలా కాకుండా 15 నుండి 20 నిమిషాల వ్యవధిలో తిరిగితే ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణీకులు కోరుతున్నారు.

18 Jan 2026

Leave a Comment