జంగరాయి గ్రామంలో ధాన్యం కొనుగోలు నిలిపివేత.. వర్షానికి తడిసిన వరిపై రైతుల ఆవేదన…..

On: Wednesday, May 27, 2026 9:36 AM

జంగరాయి గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో వరి ధాన్యం కొనుగోలు నిలిచిపోయిందని రైతు పడాల శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ లారీలు రాకపోవడంతో కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని రైతులు తెలిపారు.

 

ఇటీవల కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని త్వరగా తరలించి కొనుగోలు ప్రక్రియను పునఃప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.

27 May 2026

Leave a Comment