నివ్వరపోయిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ….

On: Monday, May 25, 2026 5:56 PM

ఎ9 న్యూస్ :మాసాయిపేట ,మే, 25:

మాసాయిపేట మండలం నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కొనుగోలు కేంద్రం సెంటర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా రైతులు ఆవేదనతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న రైతుల మీద ప్రేమ నాటకమే”అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వడ్ల కొనుగోలు ఆలస్యం కావడం, లారీలు సమయానికి రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి,రైతుల వడ్లను త్వరితగతిన కొనుగోలు చేసి,అన్ని సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండల శాఖ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, బి ఆర్ఎస్ నాయకులు చిట్టిమీల నాగరాజు కైలాస శ్రీనివాస్, దుంపల శ్రీనివాస్, దుంపల శేకులు, రైతులు తదితరులు ఉన్నారు.

25 May 2026

Leave a Comment