ఖుద్వాన్పూర్‌లో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ…..

On: Monday, September 15, 2025 6:08 PM

 

నందిపేట్, సెప్టెంబర్ 15:

నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ ఈరోజు ఘనంగా జరిగింది. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయ్‌న్న గారి ఆదేశాల మేరకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రహరీ గోడ నిర్మాణానికి ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ. 4 లక్షలు వినయ్‌న్న గారు మంజూరు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఖుద్వాన్పూర్ గ్రామానికి ఇప్పటివరకు సుమారు రూ. 50 లక్షల నిధులు మంజూరు అయినట్లు నాయకులు తెలిపారు.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరు చేస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుక్కన్న, గుండు హరీష్, ధర్మన్న, తబ్రేజ్, ఇసుబ్, రఫీక్, ముజీబ్, మహేష్, జావీద్ తదితర మైనార్టీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

14 Feb 2026

Leave a Comment