బొమ్మరం చౌరస్తా జాతీయ రహదారి 44వ హైవేపై రైతులు మహిళలు ధర్నా రాస్తారోకో…..

On: Wednesday, May 20, 2026 5:13 PM

 

ఎ9 న్యూస్ ,మాసాయిపేట, మే, 20:

వడ్లు కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ నాగసానిపల్లి, బొమ్మరం, మహిళలు వృద్దులు పురుషులు అందరూ ఐక్యంతో కలిసి కదలి రావడంతో, చుట్టుపక్కల గ్రామాల నివ్వరు పోయారు. అదేవిధంగా రైతులు మహిళలు మధ్యాహ్నం బుధవారం జాతీయ రహదారి 44 హైవేపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. 20 రోజులుగా కేంద్రంలో వడ్లు కొనుగోళ్లు నిలిచిపోయాయని, తహశీల్దార్కు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం చేశారు. అందుకు సమాజానికి తెలవడానికి రోడ్డుపైకి వచ్చామని అన్నారు. జాతీయ రహదారి పై తహశీల్దార్కు వ్యతిరేకంగా నినాదాలు ఎమ్మార్వో డౌన్ డౌన్, చేస్తూ రాస్తారోకో చేయడంతో వాహనాలు ఇరువైపులా కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న చేగుంట పోలీసులు ఎస్సై చేతన్యకుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో హామీ ఇచ్చి మాట్లాడి ధర్నా విరమింప జేశారు. అని అన్నారు.

20 May 2026

Leave a Comment