అంకాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్స్‌పై దుమారం….

On: Saturday, September 27, 2025 1:39 PM

 

ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ గ్రామంలో పంపిణీ చేసిన 92 డబుల్ బెడ్ రూమ్స్‌పై రాజకీయ దుమారం రేగింది. ఈ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెచ్చారా? లేకపోతే గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినవేనా? అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒక్క అంకాపూర్‌కే 124 డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు చేసి పనులు ప్రారంభించారని, రాష్ట్రం–కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని జన్నేపల్లి రంజిత్ (బిఅర్ఎస్ ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు) మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో ప్రతి ఊరికి 10 ఇళ్లు కడతానన్న రాకేష్ రెడ్డి హామీ ఎప్పుడూ నెరవేరుతుంది? జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధిలో పాయింట్ వన్ పర్సెంట్ చేసినా చాలును” అని ఆర్మూర్ ప్రజల వ్యంగ్యం.

ఇక ఈ కార్యక్రమానికి హాజరైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై కూడా కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ – “వయసు దాటిన పెద్దమనిషి ఇలాంటి పనులు చేయడం సరికాదు” అని ఎద్దేవా చేశారు.

15 Feb 2026

Leave a Comment