జక్రాన్ పల్లి మండలం ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన చిరుధాబాలో మద్యం సేవనం – ప్రజల ఆందోళన….

On: Thursday, January 22, 2026 3:28 PM

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే ఉన్న చిరుధాబాలో మద్యం సేవించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాబాలలో మద్యం సేవించరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు యథేచ్ఛగా నిర్వహిస్తున్న ఆర్డర్ మెస్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ దాబా వద్ద రోడ్లపై వాహనాలను నిలిపివేయడం వల్ల రాకపోకలు సాగించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ట్రాఫిక్ జామ్ పరిస్థితులు ఏర్పడుతూ ప్రమాదాలకు కూడా ఆస్కారం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

అంతేకాక, ఈ దాబా పక్కనే ఒక ప్రైవేటు పాఠశాల ఉండటంతో విద్యార్థుల భద్రత, వాతావరణంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యాసంస్థల సమీపంలో ఇలాంటి చర్యలు అనుమతించకూడదని, వెంటనే అధికారులు స్పందించి దాబాలో మద్యం సేవనంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

15 Feb 2026

Leave a Comment