నర్సారెడ్డికి నిరసన సెగ….
ఎ9 న్యూస్, తూప్రాన్, మే 20:
తూప్రాన్ మండలం కిష్టపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కార్యక్రమానికి వచ్చిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డి ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై ఆపి నిలదీశారు.
పార్టీ కార్యక్రమాల విషయంలో స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టడం సరైంది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో కిష్టపూర్ గ్రామంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.








