చందాపూర్ గ్రామంలో నల్ల పోచమ్మ అమ్మవారికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాలు ఘనంగా నిర్వహణ…..

On: Tuesday, May 12, 2026 8:59 PM

మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట్ మండలం పరిధిలో ఉన్న చందాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మవారికి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల ఊరేగింపును వైభవంగా జరిపారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలు, భక్తి గీతాలతో గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.రిపోర్టర్ శ్రీ కాంత్ .

13 May 2026

Leave a Comment