ఆర్మూర్,
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అనీఫ్ పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ విధానం కేవలం ఎస్సీ, ఎస్టీలకే పరిమితం కాకుండా బీసీలు, వైశ్యులు సహా ప్రతి వర్గానికీ వారి జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించడానికేనని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
విద్య, ఉద్యోగ రంగాలలో అందించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని బడుగు, బలహీన వర్గాల యువత రాజకీయాల్లోకి రావాలని, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జంబీ సుమన్, పికిలివంటి శంకర్, శ్రీతిక్ తదితరులు పాల్గొన్నారు.








