ఎ9 న్యూస్, మాసాయిపేట, మే 24:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని పోతినపల్లి గ్రామానికి చెందిన బర్రె సత్తయ్య తండ్రి,కీ.శే. పెంటయ్య ,ఎస్సీ (మాదిగ), గ్రామం పోతినపల్లి, మా తండ్రి పెంటయ్య మా గ్రామంలో గల సర్వే నెంబర్ 203 లో 0-25 గుంటల భూమిని 1993 మా తండ్రి కొనుగోలు చేసినాడు. అప్పటి నుండి మేమే కాస్తు చేస్తు కబ్జ్చాలో ఉన్నాము. అని ఈ భూమిని కొద్ది రోజుల క్రితం మా గ్రామానికి చెందిన చెందిన,మా పాలి వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్న బర్రె బాబు అక్రమంగా మాకు తెలియకుండా తన పేరున రికార్డుకు నమోదు చేయించుకున్నాడు. ఈ విషయం విచారణ జరిపి
భూమిని అక్రమంగా తన పేరు పై నమోదు చేయించుకున్న బర్రె బాబుని సస్పెండ్ చేసి, మాకు తగు న్యాయం చేయగలరని మాసాయిపేట తాసిల్దార్ ఆఫీస్ ముందు కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పరమేష్ మాదిగ మండల ఎమ్మార్పీఎస్ బాస్కర్ మాదిగ , బాలు మాదిగ తదితరులు మద్దతు తెలిపారు. ఈ భూవివాదంపై తహసీల్దార్ జ్ఞాన జ్యోతిని వివరణ కోరగా సానుకూలంగా స్పందించి విచారణ జరిపితగు న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.







