ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి….

On: Wednesday, May 27, 2026 9:53 AM

 

ప్రభుత్వం కల్లాల్లో ఉన్న మక్కలు, వడ్లు వెంటనే కొనాలి అని అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను ఉద్యోగం నుండి తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.

రైతుల సమస్యలను ప్రస్తావించినందుకు ఒక సాధారణ ఆర్టీసీ డ్రైవర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలని కోరడం తప్పు కాదని, ప్రజల సమస్యలను ప్రశ్నించే వారిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.

వెంటనే ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, ఆయనపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని జీవన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.

ప్రశ్నిస్తే ఉద్యోగాలు తొలగించే ఈ నియంతృత్వపు కాంగ్రెస్ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

27 May 2026

Leave a Comment