విలేకరుల సమావేశంలో దోండి రమణ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు …..

On: Wednesday, December 24, 2025 10:41 PM

 

*స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఘోర వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి కేటీఆర్ స‌వాల్ విసురుతున్నాడు.

*ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో గెలిచి, మా ముఖ్య‌మంత్రి ద‌మ్ము ఏమిటో ఇప్ప‌టికే మీకు చూపించాడు.

*అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌మ్మల్ని ఎవ‌రూ ఓడించ‌లేర‌ని విర్ర‌వీగితే, మిమ్మ‌ల్ని ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం చేసిన దమ్మున్న మగాడు శ్రీ. రేవంత్ రెడ్డి గారు.

*పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ కారు గుర్తు పైనే ఎన్నికలు జ‌రిగితే ఏం జ‌రిగిందో అంద‌రికి తెలుసు.

*జూబీహిల్స్ ఉప ఎన్నిక పార్టీ గుర్తుల‌పైన జ‌రిగితే కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ 25 వేల మెజార్టీ తో గెలిచాడు.

*ద‌మ్ముంటే గుర్తుల‌పైన ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని కేటీఆర్ అర్థం ప‌ర్థం లేకుండా మాట్లాడుతున్నాడు.

*నిజంగా మ‌గాళ్లు అయితే సిగ్గు, ల‌జ్జ‌, శ‌రం ఉంటే క‌విత మాట‌ల‌కు కేటీఆర్, హ‌రీష్ రావు లు స‌మాధానం చెప్పాలి.*

*హ‌రీష్ రావు చెత్త‌వాగుడు వాగుతున్నాడు.

*అధికారులను, పోలీసు అధికారుల‌ను బెదిరిస్తూ హ‌రీష్ రావు మాట్లాడుతున్నాడు.

*ఫోన్ ట్యాపింగ్ , ఫార్ములా ఈ రేస్ కేసు లు త‌ప్పుడు కేసులా..?

*త‌ప్పులు చేసి ఏ మొహంతో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నారు మీరు..?

*చేసిన త‌ప్పులు, అవినీతికి స‌మాధానం చెప్పాలి.

*రెండేళ్లు ఫామ్ హౌస్ లో దుప్ప‌టి క‌ప్పుకుని ప‌డుకున్న కేసీఆర్ ఇప్పుడు పాల‌మూరు – రంగారెడ్డి గురించి మాట్లాడుతున్నాడు.

*2015, జూన్ 11 న దేవ‌ర‌క‌ద్ర నియోజ‌క‌వ‌ర్గంలో క‌రివెన ద‌గ్గ‌ర పాల‌మూరు – రంగారెడ్డికి కేసీఆర్ శంకుస్థాప‌న చేస్తూ మూడేళ్ల‌లో ప్రాజెక్టును పూర్తి చేస్తాన‌ని చెప్పారు..

*మూడేళ్లు కాదు, పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్ పూర్తి చేయ‌లేదు.

*పాల‌మూరుకి తీర‌ని అన్యాయం చేసిన వ్య‌క్తి కేసీఆర్, పాల‌మూరు ప్ర‌జ‌ల‌ను నిండా ముంచారు.

*2009 లో పాల‌మూరు ప్ర‌జ‌లు కేసీఆర్ కు రాజ‌కీయ బిక్ష పెట్టారు.

*ప్ర‌జ‌లను ఎలా మోసం చేయాలో కేసీఆర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

*మ‌ళ్లీ కేసీఆర్ రావాల‌ని తెలంగాణ‌లో ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు..కేసీఆర్ ను జ‌నం అస‌హ్యాయించుకుంటున్నారు. టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు గాని ఇందిరమ్మ ఇల్లు గాని ఇవ్వలేదని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్లు ఇలా ఎన్నో పథకాలతో ముందుకు వెళుతుందని ఆయన అన్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చిల్లర ముఖ్యమంత్రి అని సంబోధించడం పై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు .జీవం లేని రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఖబర్దార్ అని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ లో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు కాంగ్రెస్కే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

04 Mar 2026

Leave a Comment