హైదరాబాద్:డిసెంబర్ 20
రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు, రైలు మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
అయితే మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల ఈ ఇద్దరికి వివా హం జరిగింది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవ డంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీ రుగా విలపిస్తున్నారు. వరుడు, వధువు గ్రామాల్లో విషాద ఛాయలు అలుము కున్నాయి. పోస్టుమార్ట్ అనంతరం మృతదేహాలను సొంత గ్రామాలకు తరలించనున్నారు.
ఈ ఘటన ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.








