నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు-అప్రమత్తమైన పోలీసులు….  

On: Thursday, December 18, 2025 1:20 PM

 

హైదరాబాద్:డిసెంబర్ 18

మహానగరంలోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది, కోర్టులో బాంబు పెట్టామంటూ.. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో బెదిరింపు ఈమెయిల్ పంపారు ఈరోజు రెండు గంటల సమయంలో కోర్టును పేల్చేస్తాం అంటూ దుండగులు ఆ మెయిల్ లో పేర్కొన్నారు.

దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాంబ్ స్క్వాడ్‌ను హుటాహుటిన అక్కడికి పంపించారు.న్యాయస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు.

భద్రతా చర్యల్లో భాగంగా కోర్టు పరిసరాల్లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు తరలించారు. కోర్టు ప్రాంగణం మొత్తం ఖాళీ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తీవ్ర భయాం దోళనకు గురయ్యారు.

12 Mar 2026

Leave a Comment