అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా….

On: Thursday, December 11, 2025 5:09 PM

 

జక్రాన్ పల్లి లో మార్పు నినాదం.

కత్తెర గుర్తుతో బండి పద్మ అభివృద్ధి పోరులో ముందుకు…

 

జక్రాన్ పల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి బండి పద్మ కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్నారు. గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకు వేసి భారీ మెజారిటీతో ఆశీర్వదిస్తే, జక్రాన్ పల్లి ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించి మౌలిక వసతుల అభివృద్ధి, వీధుల మెరుగుదల, తాగునీటి సౌకర్యాలు, శుభ్రత పనులను ప్రాధాన్యంగా తీసుకుంటానని తెలిపారు. గ్రామంలోని బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల సంక్షేమమే తన ప్రధాన ధ్యేయమని, ఎవరినీ అన్యాయం చేయకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తానని బండి పద్మ స్పష్టం చేశారు.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా మంచి కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామం కోసం గ్రంథాలయం ఏర్పాటు కోసం కృషి, పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వంటి పనులను చేపడతానని పేర్కొన్నారు.

జక్రాన్ పల్లి అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకు మీ ఓటు అత్యంత కీలకం… మీ యీ భారీ మెజారిటీ నాకు బలం, గ్రామానికి భవిష్యత్” అని బండి పద్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

04 Mar 2026

Leave a Comment