ఎ9 న్యూస్ ములుగు ఆగస్టు 18
ములుగు జిల్లా, ములుగు మండలంలోని తన స్వగ్రామమైన,జగ్గన్నపేటలో అంగన్‌వాడీ, పాలన కేంద్రాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఘనంగా ప్రారంభించారు. అదే గ్రామంలో అంగన్‌వాడీ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు.నూతనంగా ఏర్పాటు చేసిన పాలన కేంద్రంలో చిన్నారుల కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, ఆట వస్తువులు అందుబాటులో కి తెచ్చారు. ప్రత్యేకంగా మూడేళ్ల లోపు పిల్లల సంరక్షణ కోసం ఈ పాలన సెంటర్లు పనిచేస్తాయి.
పట్టణాల్లోని ప్లే స్కూల్ల తరహాలోనే, పల్లెల్లోని చిన్నారులకు మంచి సంరక్షణ అందించడం, వారి తల్లులకు ఆసరగా నిలవడం ఈ పాలన కేంద్రాల ప్రధాన ఉద్దేశ్యం. తల్లులు తమ చిన్నారులను సురక్షితంగా పాలన కేంద్రంలోని సిబ్బందికి అప్పగించి, ఆందోళన లేకుండా తమ పని ప్రాంతాలకు వెల్లి పనులు చేసుకోవచ్చు. పని ప్రాంతాలకు చిన్నారులను తీసుకెల్లలేక చాల మంది తల్లులు తమ ఉపాధిని కోల్పోతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం..ఆ చంటి పిల్లల సంరక్షణ కోసం పాలన కేంద్రాలను ప్రారంభిస్తోంది. చిన్నారుల సంరక్షణతో పాటు తల్లుల ఉపాధికి భరోసా కల్పించే విధంగా ఈ పాలన కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి సీతక్క తెలిపారు.







